ఇంటెలిజెంట్ జెన్యూన్ రివ్యూ……రక్తకన్నీరే!!

0
15769

        మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి ప్రస్తుతం టైం ఏమాత్రం బాలేదు… కెరీర్ మొదలు పెట్టడం అద్బుతంగానే మొదలు పెట్టి మూడు హిట్లు వరుస గా కొట్టి సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ పోయినా కానీ తర్వాత ఉన్నపళంగా రొటీన్ రొట్ట మూవీస్ తో కెరీర్ ని ఒక్కో మెట్టు దిగుతూ వస్తున్నాడు. తిక్క, విన్నర్, నక్షత్రం మరియు జవాన్ సినిమాలు నిరాశని మిగిలించి షాక్ ఇచ్చాయి.

ఇలాంటి సమయంలో ఖైదీనంబర్ 150 తో 100 కోట్ల మార్క్ అందుకున్న రెండో టాలీవుడ్ డైరెక్టర్ గా మారిన వినాయక్ డైరెక్షన్ లో సినిమా చాన్స్ కొట్టేసిన సాయి ధరం తేజ్ ఇంటెలిజెంట్ అంటూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ అప్ కమింగ్ పై…..

ట్రేడ్ లో ఇసుమంత కూడా క్రేజ్ రాలేదు…కానీ సినిమా బిజినెస్ మాత్రం 27 కోట్ల మార్క్ ని అందుకోగా నేడు ప్రేక్షలుల ముందుకు వచ్చిన సినిమా పరిస్థితి తెలిస్తే నిజంగానే షాక్ కలగక మానదు అని చెప్పొచ్చు. సాఫ్ట్ వేర్ ఇంజరీన్ టు ధర్మాభాయ్ గా మారిన సాయి ధరం తేజ్….

అలా ఎందుకు మారాల్సి వచ్చింది..మారిన తర్వాత చేసిన పనులు ఎలాంటివి అనేది సినిమా కథ… కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…రొటీన్ స్టొరీ లైన్ తో ఎప్పటి నుండో చూస్తూ వస్తున్న కమర్షియల్ సినిమాలను అన్నీ మిక్సీ లో వేసి మళ్ళీ…..

వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించాడు…స్క్రీన్ ప్లే అయినా బాగుందా అంటే ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్పితే సినిమా మొత్తం ఒక సీన్ ఒక ఫైట్ ఒక సాంగ్ లా మారుతుంది…ఇక సాయి ధరం తేజ్ అటు పవన్ కళ్యాణ్ ని ఇటు చిరు ని సీన్ సీన్ కి ఇమిటేట్ చేస్తూనే ఉన్నాడు.

అది ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ ఇలా సీన్ సీన్ కి అంటే మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉన్నంతలో సాయి కొంతవరకు ఆకట్టుకున్నా ఫుల్ మార్కులు దక్కించుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాటి పాటలకోసమే పెట్టుకున్నారు అనిపిస్తుంది.

తమన్ పర్వాలేదు అనిపించే సాంగ్స్ తో సరిపెట్టగా సినిమాకు అంతో ఇంతో క్రేజ్ వచ్చేలా చేసిన చమక్ చమక్ చాం సాంగ్ తెరకెక్కించిన విధానం సాయిధరంతేజ్ పూర్తిగా మెగాస్టార్ లా మారి చేసిన డాన్స్ కొంతవరకు ఆకట్టుకున్నాయి.

ఇక ఎడిటింగ్ చేయాల్సిన సీన్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు. అవన్నీ ఎడిట్ చేస్తే సినిమా లెంత్ 1 గంటా 30 నిమిషాల లోపే ఉంటుంది…నిర్మాణ విలువలు పర్వాలేదు. మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఓకే అనిపించుకున్నారు.

ఇక దర్శకుడు వినాయక్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా చూసిన తర్వాత ఈయనేనా ఒకప్పుడు ఆది, లక్ష్మీ, బన్నీ, అదుర్స్, ఖైదీనంబర్ 150 సినిమాలు తీసింది అనేంత అనుమానం కలిగేలా డైరెక్షన్ ఉందని చెప్పొచ్చు….’

ఒక సీన్ లో డ్రోన్ ఏకంగా ఫ్లైట్ ని మించే హైట్ లో వెళ్లి గన్ తో షూట్ చేస్తుంది…ఇలాంటి షాట్స్ సిల్లీ సీన్స్ సినిమాలో ఎన్నో ఉన్నాయి…వినాయక్ కెరీర్ లో వీకేస్ట్ మూవీ అఖిల్ అని అంతా భావించారు కానీ ఇప్పుడు ఆ ప్లేస్ ని ఇంటెలిజెంట్ సొంతం చేసుకోనుంది అని చెప్పొచ్చు.

మొదటి రోజే ఇలా చెప్పడం తప్పే కానీ సినిమా చూసిన ప్రేక్షకుల రియాక్షన్ ఇలాగే ఉంది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితి…మొత్తం మీద సినిమా బిజినెస్ 27 కోట్లు చేసింది…ఇక ఎంత రికవరీ అవుతుందో చూడాలి…సినిమాకి ఓవరాల్ గా మేము ఇస్తున్న రేటింగ్ 2.25/5 స్టార్స్…మీరు చూసి ఉంటె ఎలా అనిపించిందో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here