28 కోట్ల టార్గెట్…3 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
623

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్… వినాయక్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఏమాత్రం ప్రభావం చూపలేదు… సాయి ధరం తేజ్ కెరీర్ లోనే లోవెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా తొలి ఆటకే యునానిమస్ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది.

ఇక రెండో రోజు కూడా తొలిప్రేమ నుండి తీవ్ర పోటి ని ఎదుర్కోలేక పోయిన ఈ సినిమా…. కేవలం 60 లక్షల షేర్ ని మాత్రమె కలెక్ట్ చేసింది…28 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మూడో రోజు అయినా తేరుకుంటుంది అని అంతా భావించారు కానీ అలా జరగలేదు.

మూడో రోజు మొత్తం మీద సినిమా 46 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసిన సినిమా ఓవరాల్ గా 3.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించింది… కానీ 28 కోట్ల టార్గెట్ లో 3 కోట్లు మాత్రమె రికవరీ అవ్వడంతో టోటల్ రన్ లో ఎంత రికవరీ అవుతుందో అనేది ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here