ఇంటెలిజెంట్ 4 డేస్ టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కే డిసాస్టర్!!

0
474

  ఖైదీనంబర్ 150 లాంటి 100 కోట్ల మూవీని డైరెక్ట్ చేసిన వినాయక్ డైరెక్షన్ లో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి ఆటకే సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకుంటుంది అనుకున్నా కానీ ఏమాత్రం ప్రభావం చూపలేక పోయిన ఈ సినిమా రోజు రోజుకి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ లో కలెక్షన్స్ ని సాధిస్తూ మరింత షాక్ ఇచ్చింది.

మూడు రోజుల్లో 3.15 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా నాలుగో రోజు మండే అవ్వడం వర్కింగ్ డే కూడా అవ్వడంతో ఏమాత్రం పోటి ఇవ్వలేక భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంటూ కేవలం 36 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసి భారీ షాక్ ఇచ్చింది.

28 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు కేవలం 3.51 కోట్ల షేర్ ని మాత్రమె వెనక్కి తీసుకు రాగా టోటల్ రన్ లో ఈ సినిమా ఇచ్చే షాక్ కి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్స్ ఓనర్స్ కి దిమ్మతిరిగే షాక్ తగలడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది చరిత్రకెక్కే డిసాస్టర్ అని అంటుండటం విచారకరమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here