జైలవకుశ@104 కోట్లు…ఎన్టీఆర్ నం2

0
1864

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఇప్పటివరకు దుమ్ము లేపే కలెక్షన్స్ తో 81.5 కోట్లకు పైగా షేర్ తో భీభత్సం సృష్టించింది అని చెప్పొచ్చు. కానీ సినిమా టోటల్ బిజినెస్ 85 కోట్లవరకు ఉండటం తో క్లీన్ హిట్ కి మరో 3.5 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. కానీ సినిమాకు GST గట్టి ఎదురుదెబ్బే కొట్టింది అని చెప్పొచ్చు.

కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ 61 కోట్లకు పైగా షేర్ ని ఇప్పటి వరకు అందుకున్నట్లు సమాచారం. కాగా సినిమా కలెక్షన్స్ మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 104 కోట్ల హిస్టారికల్ గ్రాస్ మార్క్ ని అందుకుని భీభత్సం సృష్టించాయి.

ఎన్టీఆర్ కెరీర్ లో ఇలా వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని రెండు సార్లు అందుకుని సంచలనం సృష్టించింది. జనతాగ్యారేజ్ 100 కోట్ల గ్రాస్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా జైలవకుశ ఎంత దూరం వెళుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది… సినిమా టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here