జైలవకుశ కలెక్షన్స్ షాకింగ్ న్యూస్…నిజమా కాదా!!

0
6153

GST టాక్స్ ఇంప్లిమెంట్ తర్వాత తెలుగు సినిమాల కలెక్షన్స్ కి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. చిన్న సినిమాలకు టికెట్ రేట్లు 70 80 లే ఉంటాయి కాబట్టి వాటికి పెద్దగా ఇది ఎఫెక్ట్ పడలేదు కానీ భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రం ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించడానికి ఉపయోగ పడే టికెట్ హైక్స్ వల్ల GST టాక్స్ ఇంప్లిమెంట్ తో 100 లోపు అయితే 12% 100 కి పైగా టికెట్ రేటు ఉంటే 28% వరకు టాక్స్ వెళుతుంది.

ఈ ఎఫెక్ట్ ని ముందుగా ఎదుర్కొన్న భారీ సినిమా ఎన్టీఆర్ నటించిన జైలవకుశే అని చెప్పాలి. మిగిలిన ఏరియాలలో కలెక్షన్స్ ఎలా ఉన్నా నైజాం లో సినిమా ఓపెనింగ్స్ పరంగా భీభత్సం సృష్టించినా GST వల్ల టాక్స్ భారీగా వెళ్ళింది. ఇది వరకు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ టోటల్ రన్ లో ఇక్కడ 19.6 కోట్ల వరకు షేర్ ని అందుకుంది.

టోటల్ గ్రాస్ 30 కోట్ల వరకు ఉంది. కాగా ఇప్పుడు జైలవకుశ టోటల్ షేర్ ఇప్పటి వరకు 16.8 కోట్లని టచ్ చేయగా గ్రాస్ 31+కోట్లకు ఉందని సమాచారం… అంటే సినిమా 3 కోట్ల మేర ఇక్కడే నష్టపోయినట్లు లెక్క. కాగా సినిమాను నైజాంలో అడ్  వాన్స్ బేస్ మీద దిల్ రాజు 21 కోట్లకు కొనగా సినిమా కి ప్రస్తుత పరిస్థితులలో 4 కోట్లకు పైగా లాస్ వచ్చే చాన్స్ ఉండటంతో నిర్మాత కళ్యాణ్ 3 కోట్లు వెనక్కి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. కానీ ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here