జైలవకుశ 4 రోజు కలెక్షన్స్ అప్ డేట్…దెబ్బ పడింది సామి

0
6549

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ మూడు రోజుల్లో ఆల్ మోస్ట్ 50 కోట్ల షేర్ తో భీభత్సం సృష్టించింది.. కాగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా 75 కోట్ల మార్క్ ని అందుకోవడం ఇక్కడ విశేషం అనే చెప్పాలి. అలాగే టాలీవుడ్ చరిత్రలో బాహుబలి ని పక్కకు పెడితే ఫాస్టెస్ట్ 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా రికార్డులకెక్కింది.

కాగా  4 వ రోజు స్ట్రాంగ్ నోట్ తో ఓపెన్ అయిన జైలవకుశ సినిమా మొదటి రెండు షోలకి అద్బుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ఈవినింగ్ షోలకి మాత్రం కొన్ని అడ్డంకులు ఎదురు అయ్యాయి. టెలివిజన్ లో ఫిదా మూవీ, ఇండియా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ మరియు ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫినాలే షాక్ ఇచ్చాయి.

అన్ని ఈవినింగ్ టైంలో ఎఫెక్ట్ చూపగా జైలవకుశ సినిమా రోజుని అనుకున్న లెవల్ లో ముగించలేదు… కానీ మొత్తం మీద రోజు ముగిసే సమయానికి 5 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 7 కోట్ల లోపు ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here