సింగిల్ హ్యాండ్ తో 81 కోట్లు…ఎన్టీఆర్ నువ్వు తోపు సామి

0
4371

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ కి స్పెషల్ అట్రాక్షన్స్ అంటూ ఏమి లేవు… స్టార్ కాంబినేషన్ లేదు, క్రేజీ హీరోయిన్స్ లేరు…. బెస్ట్ సపోర్ట్ కాస్ట్ కూడా పెద్దగా లేదు… ఉన్నంతలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అలాగే కెమరామెన్ చోటా కే నాయుడు సాంకేతిక నిపుణుల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే మిగిలిన అంశాలు ఏవి సినిమాలో లేవు.

కానీ ఒక్క ఎన్టీఆర్ సినిమాను భుజాన మోసి ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు సినిమాపై అంచలంచలుగా క్రేజ్ ని పెంచి బాక్స్ ఆఫీస్ దగ్గర తెగే ప్రతీ టికెట్ తన పేరిటే తెగేంతగా సినిమా క్రేజ్ ని పెంచాడు. మొత్తంగా సినిమా ని సింగిల్ హ్యాండ్ గా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిపాడు ఎన్టీఆర్.

మొత్తం మీద 81.5 కోట్లకు చేరుకుంటున్న జైలవకుశ టోటల్ రన్ లో సింగిల్ హ్యాండ్ తో ఎన్టీఆర్ ఈ సినిమా ను 80 కోట్ల క్లబ్ లో చేరేలా చేశాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ తో ఈ సినిమా ను మించిన భీభత్సం సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here