ఫాస్టెస్ట్ 75 కోట్ల రికార్డ్ కొట్టిన రావణుడు….ఇండస్ట్రీ మొత్తం షాక్

0
2140

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ భీకరమైన రికార్డు ను సొంతం చేసుకుంది… తెలుగు సినిమాల్లో బాహుబలి తర్వాత సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన జైలవకుశ సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో తొలి 3 రోజుల్లో అన్ని ఏరియాలలో హైర్స్ తో కలిపి 50 కోట్ల మార్క్ కి చేరువ అయ్యి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇదో రికార్డ్.

దాంతో పాటు బాహుబలి ని పక్కకు పెడితే టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా చరిత్రకెక్కింది ఈ సినిమా. ఇది వరకు ఖైదీనంబర్150 మరియు దువ్వాడ జగన్నాథం సినిమాలు 4 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నాయి.

ఇప్పుడు జైలవకుశ సినిమా కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఈ ఫీట్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ఇలాగే కొనసాగితే వీకెండ్ ముగిసే సమయానికి సినిమా 85 కోట్ల నుండి 90 కోట్ల మధ్యలో గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here