చెన్నై గడ్డపై ఎన్టీఆర్ ఇండస్ట్రీ రికార్డ్…సామి శిఖరం…టచ్ చేయలేరు

0
1236

  టాలీవుడ్ లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక మరియు తమిళ నాడు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు… అసలే వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా చేసిన జైలవకుశ మరోసారి సత్తా చాటగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల కూడా మంచి వసూళ్ళతో దుమ్ము లేపి ఎన్టీఆర్ క్రేజ్ ని రుజువు చేసింది.

సినిమా తమిళ్ లో అదిరిపోయే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా ఒక్క చెన్నై ఏరియాలోనే ఏకంగా 93 లక్షల గ్రాస్ తో సంచలనం సృష్టించింది ఈ సినిమా. కాగా ఇది అక్కడ డైరెక్ట్ తెలుగు సినిమాల విషయం లో అల్టిమేట్ రికార్డ్ అని ట్రేడ్ విశ్లేషకులు అభి ప్రాయ పడుతున్నారు.

కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన స్పైడర్ తెలుగు వర్షన్ కూడా 91 లక్షల గ్రాస్ అందుకున్నా ఆ పోటి లో గెలిచిన ఎన్టీఆర్ జైలవకుశ మొత్తంగా 93 లక్షలతో చెన్నై గడ్డపై ఇండస్ట్రీ రికార్డ్ ను తిరగరాసి ఎన్టీఆర్ పేరిట అల్టిమేట్ రికార్డ్ వచ్చేలా చేసింది. ఇక ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here