జైలవకుశ@డే 14…ఎంత కలెక్ట్ చేసిందంటే!!

0
2100

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో 75.7 కోట్ల మేర షేర్ ని వసూల్ చేయగా టోటల్ గా గ్రాస్ 130 కోట్లను టచ్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా 14 వ రోజు మరో వర్కింగ్ మరియు థియేటర్స్ భారీగా తగ్గడం వలన మరింత డ్రాప్స్ ని దక్కించు కున్న ఓవరాల్ గా ఓకే అనిపించు కుంది.

కాగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 వ రోజున 30.6 లక్షల మేర కలెక్షన్స్ ని రాబట్టగా ఓవరాల్ గా 14 వ రోజుల కలెక్షన్స్ మార్క్ ఇప్పుడు 76 కోట్ల మార్క్ ని దాటింది అని చెప్పొచ్చు. పూర్తి ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు మరో ఆర్టికల్ లో పబ్లిష్ చేస్తాం.

జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 56 కోట్లకు చేరువ అవ్వడం తో ఇంకా బ్రేక్ ఈవెన్ కి 11 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం ముంది…ముఖ్యంగా నైజాం లో మరో 5 కోట్లే మేర సినిమా కలెక్షన్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది…మరి దీపావళి వరకు దసరా సినిమాలకు పోటి లేదు కాబట్టి మరింతగా హోల్డ్ చేస్తే ఆ మొత్తానికి క్లోజ్ గా వెళ్ళొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here