జైలవకుశ జపాన్ కి వెళ్ళే రోజు ఇదే…ఫ్యాన్స్ రచ్చ

0
2649

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక తో పాటు ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా తిరుగు లేని ఫామ్ లో ఉన్నాడని చెప్పొచ్చు. కాగా ఇక్కడి తో పాటు ఎన్టీఆర్ కి జపాన్ లాంటి ఇతర దేశంలో కూడా ఫ్యాన్స్ ఉండటం విశేషం అనే చెప్పాలి. అక్కడ సౌత్ నుండి రజినీ కాంత్ తర్వాత ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఎన్టీఆర్ ఓకే ఒక్కడు అని చెప్పొచ్చు.

బాద్ షా నుండి తన సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తున్న ఎన్టీఆర్ టెంపర్, నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ లాంటి సినిమాలను అక్కడ రిలీజ్ చేశాడు. అక్కడ నుండి ఫాన్స్ ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ తో ఆటోగ్రాఫ్స్ తీసుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమా త్వరలోనే అక్కడ రిలీజ్ కాబోతుంది. మిగిలిన కంట్రీస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా జపాన్ లో లేట్ గా రిలీజ్ కానుంది. ఈ నెల చివరి కల్లా జపాన్ లో సినిమా రిలీజ్ కాబోతుందని సమాచారం…అంటే 27 వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here