జైలవకుశలో ఎన్టీఆర్ “అపరిచితుడు”

0
127

2017 ఇయర్ లో ప్రేక్షకులముందుకు రాబోతున్న క్రేజీయెస్ట్ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ కూడా ఒకటి. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఏ హీరో కూడా చేయని విధంగా మూడు విభిన్న పాత్రలను ఒకే సినిమాలో చేయబోతున్నాడు ఎన్టీఆర్.

కాగా అందులో ఓ క్యారెక్టర్ మాత్రం ఇప్పటివరకు టాలీవుడ్ హీరోల్లో ఏ హీరో కూడా అటెంప్ట్ చేయిని విధంగా ఉండబోతుందని టాక్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పాత్ర పూర్తిగా అపరిచితుడులో విక్రమ్ ని పోలి ఉంటుందని అంటున్నారు.

అంటే స్ప్లిట్ పెర్సనాలిటీ కలిగిన పాత్ర అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ పాత్రకి నత్తితో పాటు కొన్ని పదాలు కూడా పలకరావు అంటున్నారు. ఈ పాత్రతో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించడం ఖాయం అంటున్నారు. సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here