జైలవకుశ రివ్యూ…ఏం సినిమా రా బాబు..భీభత్సం అసలు

0
5773

     ఒకటి తర్వాత ఒకటి వరుసగా మూడు విజయాలు తన సొంతం చేసుకున్న హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంచలన మూడు పాత్రల సినిమా జైలవకుశ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది…ఎన్నో అంచనాలను భుజాన మోసిన ఈ సినిమా ఎన్టీఆర్ కి వరుసగా 4 వ విజయాన్ని ఇచ్చిందా… బాబీ కి ఫ్లాఫ్ నుండి విముక్తి కలిగించిందా…. నిర్మాతగా నటుడిగా ఫ్లాఫ్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కి ఉపశమనం కలిగిందించి౦దా….. ఐరెన్ లెగ్ హీరోయిన్ అనిపించుకున్న రాశిఖన్నా కి లైఫ్ ఇచ్చిందా….హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్న నివేతా థామస్ కి హాట్రిక్ గా నిలిచిందా…. తెలుసుకుందాం పదండీ…

చిన్నప్పటి నుండి జై కి తమ్ముళ్ళు అంటే ఇష్టం ఉండదు…ముగ్గురు అన్నదమ్ములు అనుకోకుండా విడిపోవాల్సి వస్తుంది…తిరిగి ఎలాంటి పరిస్థితులలో వీళ్ళు కలుసుకున్నారు.. అసలు కలిసారా…జై మారి తమ్ముళ్ళని దగ్గర తీసుకున్నాడా అనేది సింపుల్ గా స్టొరీ లైన్..

స్టొరీ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు….కుటుంబం లో ఒకరు నెగటివ్ గా ఉండి మిగిలిన వాళ్ళకి యాంటీగా మారిన ఎన్నో కథలు అందునా డ్యూయల్ రోల్ లో ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి… కానీ ఇక్కడ ముగ్గురు ఉండటం కొద్దిగా ఫ్రెష్ నెస్ ని ఇచ్చింది.

డైరెక్టర్ బాబీ మరీ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయకున్నా ఉన్నంతలో ఎన్టీఆర్ పై నమ్మకం పెట్టుకున్న అశేష అభిమానులను…ఎన్టీఆర్ ను ఇప్పుడిప్పుడే బాగా ఇష్టపడుతున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో అలా మెప్పించాడు. ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఇన్నాళ్ళు నిలిచిన ఎన్టీఆర్ టెంపర్ నుండి మారిన విషయం తెలిసిందే.

ఇందులో కూడా మారిన ఎన్టీఆర్ తో పాటు గత మూడు సినిమాలుగా మాస్ ఎలిమెంట్స్ కి దూరంగా ఉన్న ఎన్టీఆర్ ని కూడా చూపించి అన్ని వర్గాలను సంతోష పెట్టాడు బాబీ… ఎన్టీఆర్ మూడు పాత్రల్లో పరకాయప్రవేశం చేశాడు…జై పాత్ర మరియు కుశ పాత్రలను ఎక్కువ క్రెడిట్ ని తీసుకున్నాయి అని చెప్పొచ్చు లవ పాత్రతో పోలిస్తే..

సినిమా మొత్తంలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్లేస్ సుమారు 80% ఉందంటే ఎన్టీఆర్ సినిమాను తన భుజాన ఎలా మోశాడో అర్ధం చేసుకోవచ్చు….వన్ మ్యాన్ ఆర్మీగా నిలిచి ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు ఎన్టీఆర్.

నివేతా, రాశిఖన్నాలతో పాటు చిన్న రోల్ చేసిన నందిత కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు..సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది..ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ గా ఉన్నాయి..దేవి శ్రీ ప్రసాద్ అందించిన రావణ, నీ కళ్ళలోన, స్వింగ్ జరా ఊపు ఊపేశాయి…వాటిని మించి బ్యాగ్రౌండ్ స్కోర్ లో తన టాలెంట్ చూపాడు దేవి.

ప్లస్ పాయింట్స్:- ఫస్టాఫ్, ఇంటర్వెల్, ఎన్టీఆర్+ఎన్టీఆర్+ఎన్టీఆర్, దేవి శ్రీ ప్రసాద్
మైనస్ పాయింట్స్:- అక్కడక్కడ స్లో అవ్వడం, సింపుల్ స్టొరీ లైన్(ఇవి మైనర్ మైనస్ పాయింట్స్)

టోటల్ గా:- జైలవకుశ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో…ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న ఫామ్ దృశ్యా…ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే వరుసగా 4 వ హిట్ పక్కా…ఒక కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో “ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here