జైలవకుశ సెన్సార్ కంప్లీట్…సెన్సార్ వాళ్ళ షాకింగ్ రిపోర్ట్ !!

0
3965

  మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమా పై ఎలాంటి అంచనాలు నెల కొన్నాయో అందరికీ తెలిసిందే…అత్యంత భారీ ఎత్తున సెప్టెంబర్ 21 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మూడు వరుస హిట్ల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు రోజు రోజుకి పెరిగి పోతూనే ఉన్నాయని చెప్పొచ్చు.

కాగా సినిమా సెన్సార్ పనులను ముందుగా సెప్టెంబర్ 15 న జరుపుకుంటుంది అని వార్తలు వచ్చినా ఎవ్వరూ ఊహించని విధంగా సెప్టెంబర్ 13 నే జరగడం విశేషం…సినిమాను చూసిన సెన్సార్ వాళ్ళు ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి ఫుల్ ఫిదా అయిపోయారు.

మొదటి అర్ధభాగం అదుర్స్ అనిపించేదిగా ఉండగా సెకెండ్ ఆఫ్ కూడా అదే రేంజ్ ఫ్లో లో ఉండటం విశేషమని…జై క్యారక్టర్ ని ఇప్పట్లో ఎవ్వరూ మరిచిపోవడం జరగదని…ఆ రేంజ్ ఇంపాక్ట్ ని ఈ సినిమాలో జై పాత్ర క్రియేట్ చేసిందని అంటున్నారు. సినిమా ఓవరాల్ గా ఫ్యాన్స్ కి ఫీస్ట్…అని రెగ్యులర్ ఆడియన్స్ మనస్సు గెలుచుకోవడం ఖాయమని అంటూ U/A సర్టిఫికెట్ ని జారీ చేసినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here