జైలవకుశ ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా…ఫట్టా

0
5605

   సెప్టెంబర్ 1 న జనతాగ్యారేజ్ రిలీజ్ అయ్యి భీభత్సం సృష్టించిన ఏడాది పై 20 రోజుల తర్వాత టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా మూడు డిఫెరెంట్ రోల్స్ ని ఒక్క సినిమాలోనే చేసిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ ప్రేక్షకుల ముందుకు అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో సాయంత్రం 6 గంటల నుండే ఈస్ట్ దేశాల్లో ప్రీమియర్ షోలు పడగా అక్కడ నుండి సినిమా కంప్లీట్ టాక్ ఏంటో తెలిసిపోయింది.

ముగ్గురు అన్నదమ్ములలో జై తన తమ్ముళ్ళని మిగిలిన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడం నచ్చక వాళ్ళ పై పగని పెంచుకుంటాడు…అనుకోకుండా కుటుంబం మొత్తం అనుకోని పరిస్తితులలో విడిపోవాల్సి రాగా ముగ్గురు విడిపోయి అసలు ఉన్నారా లేరా అనే అనుమానం లో బ్రతుకుతూ ఉండగా అనుకోకుండా వాళ్ళు తిరిగి ఎలా ఏకం అయ్యారు అనేది సినిమా కథ.

మూడు పాత్రల్లో ఎన్టీఆర్ జీవించి నటించగా జై పాత్రకి 100 కి 200 శాతం న్యాయం చేసినట్లు చూసినవాళ్ళు చెబుతున్నారు. సినిమా లవ మరియు కుశ పాత్రలతో మొదలవ్వగా ఎప్పుడైతే జై స్క్రీన్ పైకి వస్తాడో అప్పటి నుండి సినిమా రూపురేఖలు పూర్తిగా మారిపోయి గూస్ బంప్స్ స్టఫ్ తో పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

ప్రీమియర్ షోలకే ఇలాంటి గూస్ బంప్స్ టాక్ వస్తుంటే ఇక స్పెషల్ షోలకి రెగ్యులర్ షోల కి ఎలాంటి టాక్ వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…ఇదే టాక్ ని ఆ షోలకి కూడా కొనసాగిస్తే జైలవకుశ అల్టిమేట్ హిట్ అవ్వడం ఖాయం…మరి స్పెషల్ మరియు రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో కొన్ని గంటల్లో అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here