జైలవకుశ కలెక్షన్స్ గొడవ…అసలు ఫాక్ట్ ఇదే

0
3763

        GST వలన తెలుగు సినిమాల కేలేక్షన్స్ పై ప్రభావం గట్టిగానే పడగా సినిమా కలెక్షన్స్ పెద్ద సినిమాల విషయంలో అనుకున్న రేంజ్ లో రావడం లేదు. కాగా GST తర్వాత తెలుగు లో రిలీజ్ అయిన అతి పెద్ద సినిమాలలో ముందుగా రిలీజ్ అయిన జైలవకుశ కలెక్షన్స్ పై ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగున్నాయి. సినిమా కలెక్షన్స్ విషయం లో క్లారిటీ లేదని కొందరు అంటుండగా కొన్ని వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ సినిమా కలెక్షన్స్ భారీగా చూపుతున్నాయి.

కాగా సినిమా కలెక్షన్స్ 85 కోట్లు దాటాయని 165 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని పనిగట్టుకుని కొన్ని వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ చెబుతుండటంతో అభిమానులు అవే నిజం అని నమ్ముతున్నారు. కాగా సినిమా అదే మార్క్ ని అందుకుని ఉంటే ఈ పాటికే నిర్మాతలు భారీ ఎత్తున్న సెలెబ్రేషన్స్ చేసే వారు.

ఇక అసలు విషయానికి వస్తే సినిమా రెండు వారాల్లో 76.13 కోట్ల షేర్ ని అందుకోగా 130 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాగా తర్వాత సినిమా టికెట్ హైక్స్ తగ్గడం, థియేటర్స్ తగ్గడం, కొత్త సినిమా లు వరుసగా రిలీజ్ అవ్వడం తో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.

మొత్తం మీద సినిమా కలెక్షన్స్ చెప్పడానికి ముందు 2016 లో రిలీజ్ అయిన ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ సినిమా అప్పటి టాక్స్ లెక్కల ప్రకారం 15% టాక్స్ చెల్లించగా మొదటి వారంలో 65 కోట్ల షేర్ ని అందుకుంది. రెండో వారం మొత్తం మీద 10 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక మూడో వారం 5 కోట్లు, మిగిలిన రోజుల్లో మరో 5 కోట్ల మేర షేర్ ని కలెక్ట్ చేసి మొత్తంగా 85 కోట్ల మార్క్ ని 140 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. కాగా సినిమాకి రిలీజ్ సమయంలో దాదాపు 30 రోజులకు పైగా ఎలాంటి పోటి లేదు.

కానీ జైలవకుశకి అలా కాదు రిలీజ్ అయిన 6 వ రోజు నుండే వరుసగా సినిమాల పోటి ఇస్తుండగా వాటికి తోడూ GST వల్ల నష్టపోయిన జైలవకుశ కలెక్షన్స్ 2 వారాల తర్వాత మందగించాయి. మొత్తం మీద జైలవకుశ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

100కి లోపు అయితే 18% అలాగే 100 కి పైగా 2 వారల వరకు ఉండటం 28% టాక్స్ వెళ్ళగా సినిమా మొదటి వారంలో 66 కోట్లు అలాగే రెండో వారంలో 10.13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది….ఇక మూడో వారంలో సినిమా 2.6 కోట్ల షేర్ ని అందుకుంది.

మొత్తం మీద 3 వారాల్లో 78.73 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 4 వారం నుండి ఇప్పటి వరకు 1.6 కోట్ల షేర్ ని అందుకుంది…లాంగ్ రన్ లో మరో 1 కోటి వరకు కలెక్ట్ చేసే చాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అంటే మొత్తం మీద వాటితో కూడా కలిపితే సినిమా 81 కోట్ల మార్క్ ని క్రాస్ చేయోచ్చు.

ఇప్పటి వరకు సినిమా అందుకున్న గ్రాస్ మొత్తం 142 కోట్లు…ఒకవేళ జనతాగ్యారేజ్ లెక్కలతో జైలవకుశని కంపేర్ చేస్తే సినిమా 86 కోట్ల షేర్ మార్క్ ని అందుకునేది… కానీ GST వలన సినిమా కలెక్షన్స్ కి దెబ్బ పడింది…దాంతో పాటు భారీ పోటి వలన సినిమా కలెక్షన్స్ తగ్గాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here