జైలవకుశ రెగ్యులర్ మార్నింగ్ షో టాక్…యునానిమస్ హిట్ టాక్

0
1598

  ప్రీమియర్ షోల కి యునానిమస్ హిట్ టాక్ ని తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా కి స్పెషల్ ఫ్యాన్స్ షో ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తుంది…ఇవన్నీ ఫ్యాన్స్ చెబుతున్న మాట… మరి సినిమాని పోషించేది కామన్ ఆడియన్స్…మరి వాళ్ళ టాక్ జైలవకుశ సినిమా పై ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…రెగ్యులర్ మార్నింగ్ షోలు చాలా ఏరియాలలో 8, 9 లోపే మొదలు అవ్వడం జరిగింది…కొన్ని ఏరియాలలో అంతకు ముందే పడటం జరిగింది.

సినిమాలో కథ చాలా చిన్నదిగా ఉందన్న మాట నిజం…బాబీ గొప్ప కథని మాత్రం రాసుకోలేదు…కానీ గొప్ప నటుడిగా ఈ తరం హీరోలలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ లాంటి నటుడిని అందునా హిట్ ట్రాక్ లో ఉన్న నటుడితో మూడు పాత్రలు పోషించేలా చేసి మెప్పించాడు బాబీ.

అక్కడే సినిమా సగం విజయం సాధించగా చాలా సన్నగా ఉన్న కథ ని ఎన్టీఆర్ తన భుజాన మోసి కథ గురించి పట్టించుకోకుండా తన నటనతో సినిమా మొత్తాన్ని చూసేలా చేశాడు అంటూ కామన్ ఆడియన్స్ చెబుతున్నారు…కొన్ని సీన్లు బోర్ అనిపించినా క్లైమాక్స్ కొంత వీక్ అనిపించినా ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు మాత్రం బాగుంది అని అనిపిస్తుందని అంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా ఇలాంటి టాక్ చెబుతుండటం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here