జైలవకుశ షూటింగ్ లో గందరగోళం…టెన్షన్ అవుతున్న ఫ్యాన్స్

0
97

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ జైలవకుశ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది…అది బాబీ ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో కలిసి దిగిన ఫోటో.

డైరెక్టర్ తో ఫోటోలు దిగడంలో పెద్ద వింతేమి లేదు కానీ ఆ ఆర్టిస్ట్ వేసుకున్న కాస్ట్యూమ్స్ మాత్రం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కలవరపెడుతుంది. దానికి కారణం సినిమా కమర్షియల్ మూవీ అనుకుంటే ఇలా మైతలాజికల్ మూవీలా కాస్ట్యూమ్స్ ఏంటని వాళ్ళలో సందేహం.

కాగా యూనిట్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ కి సంభందించిన ఓ రోల్ నాటకాల్లో ఉంటుందని ఆ పాత్ర తాలూకు లుక్స్ లో ఇది ఒకటని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సినిమాపై బోలెడు అంచనాలు పెట్టుకున్నారు…మరి ఏం జరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here