జై సింహా భీభత్సం…బాక్స్ ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
5791

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి క్రేజ్ నడుమ రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ ని అద్బుతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది…సినిమాపై రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి పోరులో అజ్ఞాతవాసి ఫలితం తేటతెల్లం అవ్వడంతో ఉన్నపళంగా జై సింహా పై క్రేజ్ ఏర్పడింది…దానికి తోడూ మాస్ కంటెంట్ తో సినిమా ఆకట్టుకోవడం ప్లస్ అయ్యింది.

సినిమా సీడెడ్ ఏరియాలో దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది…మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే సీడెడ్ లో బాలయ్య కెరీర్ లో టాప్ 2 బెస్ట్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు..మొత్తం మీద నైజాంలో 60%, ఆంధ్రాలో 50 టు 55% మరియు సీడెడ్ లో 80%+ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందట.

దాంతో సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 6 నుండి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టే చాన్స్ ఉందని అంటున్నారు…అజ్ఞాతవాసి పోటి అండ్ గ్యాంగ్ రిలీజ్ వలన జై సింహా కి కాంపిటీషన్ గట్టిగా ఉండటం వలన ఓపెనింగ్స్ ఇలా ఉన్నాయని సోలో రిలీజ్ అయ్యుంటే రచ్చ మరో విధంగా ఉండేదని అంటున్నారు…మరి రోజు ముగిసే సరికి స్టేటస్ ఏంటో రాత్రి అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here