బాలయ్య దెబ్బా మజాకా…వరల్డ్ వైడ్ గా భీభత్సం ఇది

0
3979

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జైసింహా…. రీసెంట్ గా అఫీషియల్ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా సోషల్ మీడియా లో నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కాగా ఫస్ట్ లుక్ కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా త్వరలోనే సినిమా అఫీషియల్ టీసర్ ని అభిమానుల కోసం రిలీజ్ చేయాలనే ఆలోచన లో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం.

కాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన అతి కొద్ది సమయంలోనే నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన బాలయ్య జైసింహా చూస్తూ ఉండగానే ఏకంగా వరల్డ్ వైడ్ గా టాప్ 38 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది. కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా..

సంక్రాంతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. సినిమా క్రేజ్ ఎలా ఉందో ఫస్ట్ లుక్ ట్రెండ్ అయిన విధానం మరోసారి రుజువు చేయగా ఇప్పుడు టీసర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య టీసర్ తో ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here