జైసింహా రెండో వారం….ఎన్ని థియేటర్స్ లో రన్ అవుతుందో తెలుసా??

0
854

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనంగా మొదటి వారం ముగించుకుంది. మొత్తం మీద ట్రేడ్ లెక్కల ప్రకారం 23.33 కోట్ల షేర్ ని నిర్మాతల లెక్కల ప్రకారం 27 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. కాగా రిలీజ్ కి ముందు సినిమా పై అంచనాలు లేకున్నా రిలీజ్ తర్వాత సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా రెండో వారం లో అడుగు పెట్టింది.

కాగా మొదటి వారం మొత్తం మీద 650 నుండి 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా మొదటి వారం ముగిసిన తర్వాత మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోల్చితే హైయెస్ట్ థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది.

రెండో వారంలో మొత్తం మీద 350 కి పైగా థియేటర్స్ లో సినిమా రన్ అవుతుంది…నైజాంలో బాలయ్య కెరీర్ లో రికార్డ్ లో 180 వరకు థియేటర్స్ లో సినిమా రన్ అవుతుంది…ఇది వరకు లెజెండ్ సినిమా రెండో వారంలో 160 కి పైగా థియేటర్స్ లో రన్ అయ్యింది…ఇప్పుడు రెండో వారంలో సినిమా ఇన్ని థియేటర్స్ లో హోల్డ్ చేసింది కాబట్టి కలేక్షన్స్ ఎంతవరకు ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here