జై సింహా Day-1 కలెక్షన్స్ అప్ డేట్…ఊచకోతే….కానీ!!

0
3460

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. కానీ సినిమాకు పోటిగా ఒకవైపు అజ్ఞాతవాసి మరో వైపు డబ్బింగ్ మూవీ గ్యాంగ్ ఉండటంతో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తి కరంగా మారింది…మొత్తం మీద రోజు ముగిసే సమయానికి జై సింహా సినిమా స్టేటస్ ఎలా ఉందో తెలుసుకుందాం…

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల వరకు ఓపెనింగ్స్ విషయంలో సీడెడ్ టాప్ ఉండగా ఈవినింగ్ షోలకి వచ్చేసరికి అదే లీడ్ ని కొనసాగించగా నైజాం మరియు ఆంధ్రా ఏరియాల్లో కూడా మరింత గ్రోత్ కనిపించినా గ్యాంగ్ సినిమా గట్టి పోటి ని ఇచ్చి కొన్ని కలెక్షన్స్ ని తనవైపు తెప్పించుకుంది.

కానీ ఓవరాల్ గా రోజు ముగిసే సరికి సినిమా ఈజీగా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. టికెట్ హైక్స్ లాంటివి లేకపోవడం…ఇరువైపులా పోటి వలన సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని అందుకోలేదు….కానీ పండగ వీకెండ్ లో సినిమా మరింత పుంజుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here