జై సింహా డే 2 బాక్స్ ఆఫీస్ స్టేటస్…..దిమ్మతిరిగే షాక్

0
3424

  నట సింహా నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 7.8 కోట్ల షేర్ ని అందుకుని బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాప్ 5 సినిమాల జాబితాలో ఒకటిగా చేరింది… ఇంత పోటిలో ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి..అది కూడా ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే సాధించింది ఈ సినిమా.

కాగా మొదటి రోజు పూర్తి అయ్యే సరికి టాక్ మరీ అద్బుతంగా లేకున్నా పర్వాలేదు అనిపించుకోగా రెండో రోజు సినిమా డ్రాప్ అవుతుందని కొందరు విమర్శించారు…కానీ సినిమా రెండో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ తో బి సి సెంటర్స్ లో మంచి జోరు చూపిస్తూ దూసుకుపోతుంది.

ముఖ్యంగా గుంటూరు, సీడెడ్, కృష్ణా లాంటి ఏరియాల్లో దుమ్ము లేపుతున్నట్లు సమాచారం…ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే సినిమా డ్రాప్స్ కేవలం 35 నుండి 40% వరకు మాత్రమె ఉన్నాయని అంటున్నారు…అంటే ఈ రోజు సినిమా మినిమమ్ 3 నుండి 4 కోట్ల రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ రాబట్టే చాన్స్ ఉంది…ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ఉంటె ఈ మార్క్ ని దాటే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here