జై సింహా డే 2 కలెక్షన్స్…దుమ్ము లేచిపోయింది సామి!!

0
1535

  నట సింహా నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ గా 7.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే…రెండో రోజు సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందా అని ఇప్పుడు అందరు ఎదురు చూడగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి బి సి సెంటర్స్ లో ఓకే కలెక్షన్స్ అలాగే ఎ సెంటర్స్ ఎబో యావరేజ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది ఈ సినిమా…

కానీ ఈవినింగ్ షోల కి మాత్రం మరింత గ్రోత్ సాధించిన ఈ సినిమా మొత్తం మీద రోజుని బాగానే ముగించే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పొచ్చు. సీడెడ్ మిగిలిన ఏరియాల కన్నా కూడా ఫుల్ లీడింగ్ తో రెండో రోజు కూడా దుమ్ము లేపుతుంది. ఈ రోజు కూడా సినిమా అక్కడ 1 కోటి షేర్ రావడం పక్కా అంటున్నారు.

ఇక నైజాం మిగిలిన ఏరియాల్లో కూడా మంచి వసూళ్లు సాధించిన సినిమా మొత్తం మీద 3.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించే చాన్స్ ఉందని అంటున్నారు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. సినిమా లాంగ్ వీకెండ్ లో 20 కోట్లు టచ్ చేసే చాన్స్ ఉందని కూడా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here