బాలకృష్ణ [జైసింహా] ఫస్ట్ లుక్…బాలయ్య ఊచకోత

0
2097

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జైసింహా…భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ తర్వాత భారీ అంచనాల నడుమ వచ్చిన పైసా వసూల్ అంచనాలు అందుకోవడంలో విఫలం అవ్వడం తో ఈ సినిమాపై భారీగా క్రేజ్ నెలకొంది. దానికి కారణం దర్శకుడు కే.ఎస్.రవికుమార్ మరియు సినిమాకు పెట్టిన సింహా సెంటిమెంట్ టైటిల్ అని చెప్పొచ్చు.

ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నందమూరి అభిమానులు మీసం మెలేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య లుక్ కి ఫిదా అవ్వని వారు లేరనే చెప్పాలి. టైటిల్ కూడా క్యాచీగా ఉండటం తో ఇప్పుడు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల లోనే ఫస్ట్ లుక్ టీసర్ ని రివీల్ చేయనున్నారట. డిసెంబర్ చివర్లో సినిమా ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించి సినిమాను సంక్రాంతి కి భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు సమాచారం…మీరు ఫస్ట్ లుక్ చూసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here