జై సింహా సెన్సార్ రిపోర్ట్…బాలయ్య ఊచకోత ఖాయం అంట!!

0
1866

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102 వ సినిమా జైసింహా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించడానికి 12 న భారీ ఎత్తున రిలీజ్ కానుంది…గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య చేసిన పైసావసూల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వని కారణంగా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు నందమూరి బాలయ్య అభిమానులు… కాగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుని రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

కాగా సినిమాకు సెన్సార్ నుండి వస్తున్న రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి. రెండు వేరియేషన్స్ లో బాలయ్య అద్బుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని… గెటప్ అండ్ విగ్స్ కొంచం బ్యాడ్ గా ఉన్నా పెర్ఫార్మెన్స్ పరంగా బాలయ్య చెడుగుడు ఆడేసుకున్నాడు అని అంటున్నారు.

సినిమాలో సెకెండ్ ఆఫ్ మెయిన్ హైలెట్ అని…అనేక ట్విస్ట్ లతో కూడుకుని ఉంటుందని అంటున్నారు. మరి 12 న రిలీజ్ కాబోతున్న సినిమాకి ఈ సెన్సార్ రిపోర్ట్ ఎంతవరకు అడ్వాంటేజ్ గా నిలుస్తుందో చూడాలి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మరియి ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here