బాలయ్య జై సింహా రివ్యూ అండ్ రేటింగ్…..సింహం ఘర్జించిందా లేదా??

0
6939

         గత ఏడాది సంక్రాంతి కి గౌతమీపుత్ర శాతకర్ణి తో వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న బాలయ్య ఏడాది తిరిగే సరికి మూడు సినిమాలు రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు…ఆ మూడో సినిమాగా జై సింహా లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది…భారీ అంచనాలు ఏవి లేకున్నా సినిమా సంక్రాంతి సందడి చేయడం పోటి లో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి ఆల్ మోస్ట్ ఫలితం తేలడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఆలస్యం చేయకుండా సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి…హీరో హీరోయిన్….ఒక విలన్…ఫ్లాష్ బ్యాక్ లో ఎపిసోడ్…హీరో తన ఫ్లాష్ బ్యాక్ ని మరిచిపోయి కొత్త జీవితం మొదలు పెడతాడు…కానీ తిరిగి మళ్ళీ విలన్ ఎంట్రీ….తర్వాత హీరో ఎం చేశాడు అన్నది సింపుల్ గా స్టొరీ లైన్.

తెలుగు లో ఎన్నో ఏళ్లుగా వస్తున్న స్టొరీ లైన్ ఇది…కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఇప్పటికీ ఎంతో కొంత క్రేజ్ ఉంది…దాన్ని సరిగ్గా డీల్ చేయగల దర్శకుడు ఉంటె సినిమా మళ్ళీ హిట్ అవ్వడం ఖాయం…ఇక్కడ దర్శకుడు కే.ఎస్.రవికుమార్ ఇదే పని చేయగా 80% గెలిచాడు 20% ఓడాడు అని చెప్పొచ్చు.

ముందుగా ఓడిన అంశాలు మాట్లాడితే బాలయ్య ఈ ఏజ్ లో లవ్ ట్రాక్ పెట్టడం అనేది కొంత ఎబ్బెట్టుగా ఉంటుంది…దాంతో పాటు ఫోర్సుడ్ కామెడీ అక్కడక్కడా మరింత ఇబ్బందిని కలిగిస్తుంది…అక్కడక్కడా స్లో అవుతుంది, సినిమా చివరి 20 నిమిషాలు పరమ రొటీన్ గా ముగుస్తుంది…ఇవే దర్శకుడు ఓడిపోయినా అంశాలు..

ఇక గెలిచిన అంశాలు మాట్లాడితే….హీరో నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు…ఫైట్స్, డైలాగ్స్ అండ్ అల్టిమేట్ డాన్స్, పెర్ఫార్మెన్స్ ఇలా అన్నీ ఉండేలా చూసుకున్నాడు…అమ్ముకుట్టి సాంగ్ లో బాలయ్య స్టెప్స్ కి థియేటర్స్ షేక్ అయ్యాయి..

ఇక కథనం విషయంలో స్క్రీన్ ప్లే తో రొటీన్ కథ ని ఎక్కడ బోర్ కొడుతుండే అనే భావన ప్రేక్షకులకు కలగకుండా 80% సినిమాను చకచకా నడిపించాడు దర్శకుడు రవికుమార్…రవికుమార్ తర్వాత ఎక్కువ మార్కులు సొంతం చేసుకునేది మాత్రం సంగీత దర్శకుడు చిరంతన్ భట్…

పాటలు సోసో గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో చెడుగుడు ఆడేసుకున్నాడు…హీరో ఎలివేషన్ సీన్స్ కి ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయే లెవల్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది…ఇక ఎడిటింగ్ మరింత షార్ట్ గా ఉంటె సినిమా రేంజ్ మరింత పెరిగేది…నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాలయ్య తన ఫ్యాన్స్ ని దృష్టి లో పెట్టుకుని ఎం కావాలో అన్నీ చేశాడు…హీరోయిన్స్ లో నయనతార తప్పితే మిగిలిన వాళ్ళని నటించే స్కోప్ తక్కువ…మిగిలిన పాత్రలు తమ పాత్ర పరిదిమెర నటించి మెప్పించాగా ప్రకాష్ రాజ్ కి మంచి రోల్ దక్కింది అని చెప్పొచ్చు.

మొత్తం మీద సినిమా మరీ అద్బుతం భీభత్సం అని కాదు కానీ….బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి ని ముందు లెజెండ్ ని పక్కకు పెడితే మిగిలిన సినిమాలన్నీంటిలోకి చాలా బెటర్ మూవీ….ఓవరాల్ గా సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here