బాలయ్య జైసింహా టీసర్ భీభత్సం…ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన బాలయ్య

0
1365

  నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న బాలయ్య తర్వాత చేసిన పైసా వసూల్ తో అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యాడు. కానీ ఆ సినిమా కూడా ఓపెనింగ్స్ పరంగా దుమ్ము లేపగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు జై సింహా గా రాబోతున్న బాలయ్య అఫీషియల్ టీసర్ తో సంచలనం సృష్టించి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు.

ఎలాంటి న్యూస్ లేకుండా టీసర్ రిలీజ్ కి కొన్ని గంటల ముందు న్యూస్ సోషల్ మీడియా లో రావడం చకచకా ఫ్యాన్స్ టీసర్ కోసం ఎదురు చూపులు చేయగా టీసర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ ఆకట్టుకుంటుంది. బాలయ్య మాస్ ఎలిమెంట్స్ తో మరోసారి తనదైన డైలాగ్ డిలివరీతో దుమ్ము లేపాడు.

ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ మరోసారి దుమ్ము లేపగా బాలయ్య ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో కే.ఎస్.రవికుమార్ అలాగే చూపి మెప్పించాడు….మొత్తం మీద టీసర్ తో సినిమాపై ఉన్న అంచనాలను డబుల్ చేసిన బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రం సినిమా విందుభోజనం అంటూ చెబుతుండటం విశేషం….మీరు టీసర్ చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here