జై సింహా నిర్మాతలు రిలీజ్ చేసిన అఫీషియల్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0
1487

  నట సింహా నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో నిలిచి పోటి లో ఉన్న సినిమాల కన్నా మంచి వసూళ్ళతో దుమ్ము లేపిన విషయం తెలిసిందే. కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా పరుగును ముగించుకున్న ఈ సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సాధించి సూపర్ హిట్ జాబితాలో ఎంటర్ అయ్యి బాలయ్యని సంక్రాంతి విన్నర్ చేసింది.

మొత్తం మీద సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 26 కోట్ల బిజినెస్ ని చేయగా టోటల్ రన్ లో ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా 30.2 కోట్ల షేర్ ని సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు నిర్మాతలు టోటల్ రన్ కలెక్షన్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు.

నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా టోటల్ రన్ లో 35.85 కోట్ల షేర్ ని అన్ని ఏరియాలలో ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో సాధించినట్లు సమాచారం. ట్రేడ్ లెక్కలకు నిర్మాతల లెక్కలకు 5.5 కోట్లకు పైగా తేడా ఉండగా సామాన్య ప్రేక్షకులు ఏది నిజం అని నమ్మితే అది నమ్మవచ్చు అని చెప్పొచ్చు…ఓవరాల్ గా నిర్మాతల లెక్కల ప్రకారం సినిమా బాలయ్య కెరీర్ లో మూడో బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here