చరిత్ర సృష్టించిన [జై]..రావణుడి పేరిట ఇండస్ట్రీ రికార్డ్

0
2304

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులతో దుమ్ము లేపుతుండగా మరోపక్క సినిమా నుండి మొదటగా రిలీజ్ అయిన జై టీసర్ యూట్యూబ్ లో మరో చారిత్రిక రికార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్ చరిత్రలో గత ఏడాది యూట్యూబ్ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ ఏడాది కూడా ఆ రికార్డును కట్టి పెట్టి పెట్టింది జై టీసర్.

ఇప్పటి వరకు టాప్ లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథం 18.4 మిలియన్ వ్యూస్ రికార్డును బ్రేక్ చేసి 18.5 మిలియన్ వ్యూస్ తో జై టీసర్ సంచలన రికార్డును నమోదు చేసి వ్యూస్ పరంగా టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది.

ఇక లైక్స్ విషయం లో మాత్రం మహేష్ స్పైడర్ 3 లక్షలకు పైగా లైక్స్ తో టాప్ లో నే ఉండగా జై టీసర్ మరో 22 వేల లైక్స్ సాధించితే టాప్ కి వెళ్ళే చాన్స్ ఉంది…మరి రానున్న రోజుల్లో ఈ రికార్డును కూడా అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here