బ్రేకింగ్ న్యూస్:–జైలవకుశ స్టొరీ ఇదేనట

0
4766

     టాలీవుడ్ లో రిలీజ్ సమయంలో కానీ రిలీజ్ కి ముందు కానీ సినిమాల కథలు లీక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం…కొన్ని సినిమాల కథలు రిలీజ్ కి ముందే చాలారోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడితే కొన్ని కథలు రిలీజ్ సమయానికి లీక్ అయ్యి ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది..కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మూవీ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా కథ ఇదే అంటూ ఓ కథ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..

ముగ్గురు అన్నదమ్ములు చిన్నప్పుడు విడిపోతారట…పెద్ద కొడుకు జై కి మొదటి నుండి చిన్న తమ్ముళ్ళు ఇద్దరినీ ప్రేమగా చూడటం నచ్చదట…అలా వాళ్ళ మీద పగ చిన్నప్పటి నుండే పెరిగిపోతుండగా అనుకోకుండా కుటుంబం మొత్తం చల్లాచదురు అయ్యే పరిస్థితి వస్తుందట…దాంతో ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారట.

పెద్ద కొడుకు రౌడీ మూకకి దొరకడం అలాగే పెరుగుతాడట…కుశ దొంగగా మారుతాదట…లవ మాత్రం మంచి కుటుంబానికి దొరకడంతో అలాగే పెరిగి బ్యాంగ్ మ్యానేజర్ అవుతాడట. ముగ్గురు పెరిగాక కుశ ఎలాగైనా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించి విదేశాలకు వెళ్లాలని అనుకుంటూ కొన్ని దొంగతనాలకు పాల్పడగా కుశ అనుకుని కుశ శత్రువులు లవకి యాక్సిడెంట్ చేస్తారు.

అనుకోకుండా కుశ అక్కడే ఉండటంతో శత్రువులను ఎదిరించి లవ ని సేఫ్ చేయిగా ఇద్దరు ఓకేలా ఉండటం చూసి మొదట్లో షాక్ అయినా తరువాత తాము సోదరులం అని తెలుసుకుని కలిసి ఉంటారట.ఇక కుశ సౌమ్యుడు అయిన లవ కి సొసైటీలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి విముక్తి కలిగించడానికి కొన్ని సార్లు లవగా మారుతాడట.

అదే క్రమంలో బ్యాంక్ కి వెళ్లి హడావుడి చేయడం….లవ వెళ్ళాల్సిన పెళ్లి చూపులకు కుశ వెళ్ళడం జరుగుతుందట. అక్కడ పెళ్ళికూతురు నందితను కాదని రాశిఖన్నా కి లవ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది…ఈ క్రమంలో లవ తో స్నేహంగా ఉండే నివేద అనుకోకుండా మిస్ అవుతుంది.

ఆమెని తీసుకెళ్ళింది లవ కుశలని పోలి ఉన్న జై పాత్ర…ఆమెని ఎందుకని తీసుకెళ్ళాడు…ఈ అన్నదమ్ములు తిరిగి ఒకటి అయ్యారా లేక అలాగే కొట్టుకున్నారా…జై అలా ప్రవర్తించడానికి రీజన్ ఏంటి అనేది సినిమానే చూసి తెలుసుకోవాలట….ఈ కథ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది…సెప్టెంబర్ 21 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వీటిని మించిన మరెన్నో ట్విస్ట్ లు ఉన్నాయని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు…ఇది ఎంతవరకు నిజమో తెలిసేది సెప్టెంబర్ 21 నే…అప్పటి వరకు ఆగకతప్పదు అని చెప్పొచ్చు…మీరు ఈ కథ నిజం అనుకుంటున్నారో లేదో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here