అమ్మింది 4.5 కోట్లకి…టోటల్ గా వచ్చింది ఇది!

0
4217

కమెడియన్ నుండి హీరోగా మారినా కామెడీ రోల్స్ ని విడవ కుండా అప్పుడప్పుడు హీరో రోల్స్ చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి నటించిన లేటెస్ట్ మూవీ జంబలకడిపంబ…. ఓల్డ్ క్లాసిక్ జంబలకడిపంబ పేరు మీద తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం మీద టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా టోటల్ బిజినెస్ ఎంత అనేది క్లియర్ గా తెలియ కున్నా సినిమాను 4.5 కోట్ల రేంజ్ లో అమ్మినట్లు సమాచారం.

మొత్తం మీద సినిమా టోటల్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.1 కోట్ల షేర్ ని మాత్రమె సాధించగలిగిందట. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఫ్లాఫ్ గా నిలిచిపోగా టోటల్ గా 2.4 కోట్ల రేంజ్ లో  నష్టాలను అందుకుని ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here