జవాన్ 2 వ రోజు కలెక్షన్స్ అప్ డేట్…షాక్ ఇచ్చిన సాయి ధరం తేజ్

0
3580

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 3.2 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా రెండో రోజు కూడా జోరు చూపుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా రెండో రోజు అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. మార్నింగ్ మరియు మ్యాట్నీ షో లకు డ్రాప్స్ కనిపించగా ఈవినింగ్ షోల లో గ్రోత్ ఉంటుంది అని అంతా భావించారు.

కానీ మార్నింగ్ షోస్ కి 20% వరకు ఆక్యుపెన్సీ సాధించిన జవాన్ ఈవినింగ్ షోలలో కొద్ది గ్రోత్ తో 23% ఆక్యుపెన్సీ ని సాధించింది. దాంతో సినిమా కచ్చితంగా రెండో రోజు కూడా 1.7 నుండి 2 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబడుతుంది అనుకున్నా రెండో రోజు అలా జరగలేదు.

సినిమా మొత్తం మీద 1.5 కోట్లకి అటూఇటూగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు…మరి సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఎన్ని వస్తాయో చూడాలి. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కి 16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయాలి…మరి వీకెండ్ లో ఎంత వరకు రికవరీ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here