జవాన్ మూవీ బడ్జెట్, బిజినెస్…క్లీన్ హిట్ కి ఇంకా ఎంత కావలి?

0
428

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించినా తర్వాత మాత్రం స్లో అయింది…అనుకున్న మేర కలెక్షన్స్ ని సాధించడం లో విఫలం అవ్వడం తో ఇప్పుడు సినిమా సేఫ్ అవు తుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారింది. ఒకసారి సినిమా బడ్జెట్ మరియు బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసు కుందాం పదండీ…

జవాన్ సినిమా ను మొత్తం మీద 12 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించారు…. ఇక సినిమా బిజినెస్ మొత్తం మీద 16 కోట్ల రేంజ్ లో జరిగిన విషయం తెలిసిందే…అంటే సినిమా మొత్తం మీద 17 కోట్ల షేర్ అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది…మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించింది.

కానీ వీకెండ్ వరకు మెగా ఫ్యాన్స్ హెల్ప్ చేసినా కామన్ ఆడియన్స్ మాత్రం వీకెండ్ తర్వాత సినిమా పై పెద్దగా ఆసక్తి చూపలేదు…వీకెండ్ లో 7.85 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత మొత్తం మీద 2.1 కోట్ల షేర్ ని మాత్రమె అందుకుంది…దాంతో మొత్తం మీద ఇప్పటి వరకు 9.95 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా మరో 7 కోట్ల షేర్ ని అందుకోవాలి…మరి ఎం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here