జవాన్ మూవీ డే 2 స్టేటస్…ఏంటి…హోల్డ్ చేసిందా లేదా??

0
633

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 5.5 కోట్ల గ్రాస్ ని 3.1 కోటి షేర్ ని అందుకున్నట్లు సమాచారం…కాగా ఇది సాయి ధరం తేజ్ కెరీర్ లో మూడో బిగ్గెస్ట్ ఓపనర్ అని చెప్పొచ్చు. ఇది వరకు విన్నర్ ఫస్ట్ డే(మహా శివరాత్రి హాలిడే) 5.51 కోట్లు మరియు సుప్రీమ్ మూవీ 4.7 కోట్లు మొదటి రోజు సాధించి టాప్ 2 లో ఉన్నాయి.

ఇక జవాన్ కాన్సెప్ట్ మరియు రిలీజ్ టైం దృశ్యా మంచి ఓపెనింగ్స్ నే దక్కించుకుందని చెప్పాలి…ఇక రెండో రోజు సినిమా పరిస్థితి మొదటి రోజు మాదిరిగానే ఉంటుంది అనుకున్న వాళ్ళకి కొంత షాక్ తప్పలేదని చెప్పాలి. మొదటి రోజు 40% దాకా ఆక్యుపెన్సీ లభించింది.

కాగా రెండో రోజు ఇప్పటి వరకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం సినిమా కి 20% ఆక్యుపెన్సీ మాత్రమే లభించింది….ఈవినింగ్ షోలకి గ్రోత్ ఉంటేనే సినిమా మంచి కలెక్షన్స్ ని సాధిస్తుందని చెప్పాలి. మరి టోటల్ రిపోర్ట్ ఎలా ఉందో రాత్రి 10:30 కి అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here