జవాన్ ప్రీమియర్ షో రివ్యూ…

0
2002

    సుప్రీమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తర్వాత చేసిన తిక్క మరియు విన్నర్ సినిమాలతో వరుస ఫ్లాఫ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తిక్క ప్రయోగమే అయినా పక్కా కమర్షియల్ గా కనిపించిన విన్నర్ ఫ్లాఫ్ ఇప్పుడు సాయి ధరం తేజ్ కి కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరాన్ని కల్పించింది. ఇలాంటి సమయంలో సోషల్ మెసేజ్ తో జవాన్ ఇంటికొకడు ఉంటాడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సాయిధరంతేజ్.

ఇక సినిమా ప్రీమియర్ షోలు సాయంత్రం 7 నుండే మొదలు అవ్వడంతో సినిమా టాక్ కూడా బయటికి వచ్చేసింది. కథ గురించిన వివరాలు అన్నీ ట్రైలర్ లోనే చెప్పేశారు. ఇక సినిమాలో సాయి ధరం తేజ్ తన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు అని చెప్పొచ్చు.

ఇంట్లో ఆకతాయిగా పెరిగినా అవసరం ఉన్న సమయంలో తన ప్రత్యేకత చూయిస్తూ ఉండగా అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇంతకు దారి తీశాయి అనేది కథాంశం… సోషల్ మెసేజ్ తో ఈ మధ్య పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చిన సినిమాల్లో కమర్షియల్ హంగులు లేక పూర్తిగా ఆకట్టుకోలేదు.

కానీ జవాన్ లో ఉన్న ప్రత్యేకత సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉండటం అని చెప్పొచ్చు. సాయిధరంతేజ్ సినిమా మొత్తాన్ని తన భుజాన మోయగా తమన్ సంగీతం మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ తో సెకెండ్ పిల్లర్ అయ్యాడు.

మెహ్రీన్ ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. మొత్తం మీద సినిమా లెంత్ కూడా పెర్ఫెక్ట్ గా ఉందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మెసేజ్ లు ఎంతమందికి నచ్చుతాయి అనేదానిపై సినిమా విజయం ఆధారపడి ఉంది. రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందో కొన్ని గంటల్లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here