జవాన్ మూవీ రివ్యూ-రేటింగ్

0
3527

       మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ లో స్టార్టింగ్ అద్బుతంగా ఆరంభం అయినా సుప్రీమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టినా తర్వాత చేసిన తిక్క మరియు విన్నర్ సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవుతుంది అనుకున్న విన్నర్ మాత్రం భారీ నిరాశని మిగిలించినా టోటల్ రన్ లో డిసాస్టర్ టాక్ తో 15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇలాంటి సమయంలో జవాన్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరం తేజ్ ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండీ….కథ సింపుల్ గా ఫ్యామిలీ మరియు దేశం పై ప్రేమ ఉన్న హీరో కి కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా ఎదిరించి దేశం కోసం జవాన్ లా ఎదురు నిలిచాడు అన్నది సినిమా కథ.

దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన జవాన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మెండుగా ఉన్నాయి… ఫస్టాఫ్ మొత్తం రేసీ గా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో కొనసాగగా ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోయే లెవల్ లో ఉండగా సెకెండ్ ఆఫ్ పై ఆసక్తి మరింతగా మొదలు అవుతుంది.

సెకెండ్ ఆఫ్ మొదలు అవ్వడం కూడా అదే రేంజ్ లో ఉండగా తర్వాత హీరో విలన్ ల మధ్య సాగే మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. కానీ అక్కడక్కడ స్లో అవ్వడం రొటీన్ గా సినిమా స్క్రీన్ ప్లే ఉండటం సినిమాలో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు.

సాయి ధరం తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడు. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలతో నటనకి పెద్దగా ఆస్కారం లేని పాత్రలు చేసిన సాయి ధరం తేజ్ ఈ సినిమా లో మాత్రం తనలోని నటుడిని బయటికి తీశాడు అని చెప్పొచ్చు.

ఇక హీరోయిన్ మెహ్రీన్ ఆకట్టుకోగా విలన్ రోల్ లో తమిళ్ యాక్టర్ ప్రసన్న రోల్ ఫ్రెష్ గా అనిపించింది. మొత్తం మీద సినిమా కాన్సెప్ట్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా రెండు సమపాళ్ళలో అయితే లేవనే చెప్పాలి.

తమన్ తన పాటలు మరియు బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ తో మంచి మార్కులు వేయించుకోవడమే కాదు సినిమాకి వెన్నెముకగా నిలిచాడు. ఎడిటింగ్ వర్క్ బాగుంది…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి ఎంత అవసరమో అంత పెట్టారు.

రచయితగా మంచి పేరు తెచ్చుకున్న BVS రవి దర్శకుడిగా అప్పట్లో వాంటెడ్ సినిమాతో ఫ్లాఫ్ అందుకున్న ఈ సారి జవాన్ తో మంచి సినిమా తీశాడు… కానీ తెలుగులో ఈ మధ్య దేశభక్తి తో వచ్చిన సినిమాలు తక్కువే…వాటిలో హిట్ అయినవి తక్కువే..మరి ఇలాంటి పరిస్థితిలో జవాన్ ఎంతవరకు నెట్టుకువస్తుందో అనేది ఆసక్తి కరం.

ఇక సినిమా బిజినెస్ పరంగా 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం…అంటే 16 కోట్ల మార్క్ అందుకుంటే విజయం సాధిస్తుంది…ఓవరాల్ గా ఇలాంటి మైండ్ గేమ్ మూవీస్ ఇష్టపడేవారితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఇష్టపడే చాన్స్ ఉంది. సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.75/5….మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here