మూడో సారి 100 కోట్లు..యూనిక్ ఇండస్ట్రీ రికార్డ్!!

0
1226

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో 96 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు సినిమా 4 వ రోజు లో సాధించే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోనుంది.

కాగా ఇప్పుడు ఇదే విషయాన్ని నిర్మాతలు అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో పోస్టర్ రిలీజ్ తో కంఫామ్ చేశారు. ఇక సినిమా 100 కోట్ల గ్రాస్ ని అందుకోవడంతో ఎన్టీఆర్ ఖాతాలో ఇది మూడో 100 కోట్ల గ్రాస్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఇది వరకు జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలు ఈ ఫీట్ ని అందుకోగా వరుసగా మూడు సార్లు 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here