చస్…ఎన్టీఆర్ కనుక ఈ సినిమా చేసుంటేనా!!

0
11497

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మోస్ట్ హ్యప్పెనింగ్ హీరోలలో ఒకరు… రోజు అనేక కథలు వింటూ అందులో తనకి సూట్ అయ్యే కథని ఎంచు కుని సినిమాలు చేస్తుంటాడు.. ఈ ప్రాసెస్ లో కొన్ని సినిమాలు అనుకున్న విధంగా ఆడవు…కొన్ని వేరే హీరోలవద్దకు వెళ్లి సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తాయి. అలాంటి సినిమా లు ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. అతనొక్కడే నుండి ఇప్పుడు బోయపాటి మరియు బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన జయజానకినాయక కూడా ఒకటని చెప్పొచ్చు.

కాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఎన్టీఆర్ దమ్ము అనే సినిమా చేశాడు…ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు…ఆ కథని ఓకే చేసే సమయంలో ఎన్టీఆర్ కి మొత్తంగా 9 కథలను బోయపాటి వినిపించినట్లు ఆడియో వేడుకలో ఓపెన్ గానే చెప్పాడు.

ఇప్పుడు ఆ 9 కథల్లో అల్లుఅర్జున్ చేసిన సరైనోడు అలాగే రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన జయజానకినాయక కూడా ఉన్నాయట…సరైనోడు ఫుల్ మాస్ స్టొరీ అవ్వడంతో అప్పటికి (2011) సమయంలో ఎన్టీఆర్ కొత్తగా ఉండే రోల్స్ చేస్తుండటంతో ఆ కథని నో చెప్పాడట.

ఇక జయజానకినాయక కి నో చెప్పడానికి రీజన్ అప్పటికే హీరోయిన్ ఓరియె౦టెడ్ సినిమాల ఉండే ఊసరవెల్లి చేయడంతో మళ్ళీ ఈ సినిమా చేయడం మంచిది కాదని నో చెప్పి దమ్ము చేశాడట…కానీ జయజానకినాయక లాంటి మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించే సీన్స్ ఉన్న సినిమా ఎన్టీఆర్ చేసుంటే ఆ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉండేదని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఎన్టీఆర్ చేసుకుంటే ఫలితం ఎలా ఉండేదో కాని సినిమా మాత్రం టోటల్ రన్ లో 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోలేక 22 కోట్ల లోపే వసూల్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ ఫ్లాఫ్ గా మిగిలిపోయింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here