జస్ట్ 1 లక్ష కొడితే ఎలైట్ లీగ్ లో ఎన్టీఆర్!!

0
1362

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ టోటల్ రన్ ని ముగించగా ఇప్పుడు సినిమా ఓ అరుదైన రికార్డ్ ను ఎన్టీఆర్ పేరిట తేవడానికి ఒక్క అడుగు దూరం లో ఉందని చెప్పొచ్చు. టాలీవుడ్ హీరోలలో ప్రతిష్టాత్మక౦గా భావించే ఏరియాలలో RTC X ROADS ఒకటి. ఇక్కడ దాదాపు అందరు హీరోలకి 1 కోటి గ్రాస్ సింగిల్ థియేటర్ లో అందుకున్న రికార్డ్ ఉంది.

కానీ ఎన్టీఆర్ కి మాత్రం ఇప్పటి వరకు ఈ రికార్డ్ అందలేదు… ఆది సింహాద్రి లాంటి సినిమా లు 80 లక్షల గ్రాస్ ను, నాన్నకుప్రేమతో 86 లక్షల గ్రాస్ ను జనతాగ్యారేజ్ 91 లక్షల గ్రాస్ ని అందుకున్న 1 కోటి గ్రాస్ ని అందుకోలేకపోయాయి.

కానీ ఇప్పుడు రిలీజ్ అయిన జైలవకుశ ఇప్పటి వరకు ఇక్కడ 98.9 లక్షల గ్రాస్ ని అందుకోగా మరో లక్ష గ్రాస్ ని అందుకుంటే ఇక్కడ 1 కోటి గ్రాస్ ని అందుకున్న ఎలైట్ లీగ్ హీరోల సరసన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చేర్చడానికి సిద్ధం అవుతుంది. మరి ఈ రికార్డ్ ఒకటి రెండు రోజుల్లో వస్తుందా అనేది ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here