కళ్యాణ్ రామ్ MLA హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
871

  నందమూరి కళ్యాణ్ రామ్ కి కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఆరంభం లభించినా తర్వాత డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేసినా అసలు సిసలు హిట్ మాత్రం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన పటాస్ రూపంలో దక్కింది… ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన ఆ సినిమా నూతన ఉత్తేజాన్ని కళ్యాణ్ రామ్ కి ఇచ్చినా తర్వాత వరుసగా షేర్ మరియు ఇజం అంటూ రెండు ఫ్లాఫ్స్ కొట్టాడు.

ఇలాంటి సమయంలో MLA  అంటూ ప్రేక్షకుల ముందుకు అతి త్వరలోనే రావడానికి సిద్ధం అవుతున్నాడు కళ్యాణ్ రామ్…కళ్యాణ్ రామ్ తో లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం..

మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 2.5 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం… కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇది ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా తో కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ కొడితే తన మార్కెట్ మరింత ఎక్స్ పాండ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here