75-25-75…కార్తీ భీభత్సం ఇది

0
243

తమిళ్ హీరోలలో తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న హిరో గా కార్తీకి పేరుంది…కెరీర్ మొదట్లో ఇక్కడ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నా తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయినా మళ్ళీ బైలింగువల్ మూవీ ఊపిరితో ఇక్కడ హిట్ కొట్టాడు…సోలో హీరోగా ఖాకీతో మళ్ళీ హిట్ కొట్టాడు.

తర్వాత చేసిన చినబాబు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ హిట్ కాలేకపోయినా 6 కోట్ల బిజినెస్ కి 4.8 కోట్ల దాకా షేర్ వసూల్ చేసింది. ఇదే సినిమా తమిళ్ ఒరిజినల్ మాత్రం తన కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

కార్తీ కెరీర్ లో ఖాకీ 52 కోట్ల గ్రాస్ తో కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఉండగా ఇప్పుడు ఆ రికార్డును భారీ మెజారిటీతో బ్రేక్ చేసిన చినబాబు ఏకంగా 75 కోట్ల గ్రాస్ ని అందుకుని 75 రోజుల వేడుకని 25 సెంటర్స్ లో జరుపుకుని ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతుందట…టోటల్ రన్ లో మరో కోటి లోపు గ్రాస్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here