మహానుభావుడు రివ్యూ…శర్వా మళ్ళీ కొట్టాడు సామీ

0
4043

     2016 సంక్రాంతికి భారీ పోటిలో ఓ చిన్న సినిమా ఎక్స్ ప్రెస్ రాజా రిలీజ్ అయ్యి ఎవ్వరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది… 2017 సంక్రాంతి ఎవ్వరికీ అంచనాలు లేని శతమానంభవతి సినిమా రియల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా పండగల సమయంలో పెద్ద హీరోల పోటిని కూడా బయపడకుండా సినిమా రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్న శర్వానంద్ దసరా బరిలో ఎన్టీఆర్ మహేష్ సినిమాలకు పోటిగా మహానుభావుడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

సినిమాపై పెద్దగా అంచనాలు లేకున్నా మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది అని చెప్పబడిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… అతి శుభ్రతను ఇష్టపడే వ్యక్తి తన చుట్టుపక్కల కూడా అలాంటివే కోరుకుంటూ ఇతరులను ఇబ్బంది పెడతాడు…

అలాంటి వ్యక్తి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది…చివరికి తనలో ఏమైనా మార్పు వస్తుందా…తన అతి శుభ్రత వల్ల తన ప్రేమకి ఎదురైనా అడ్డంకులను ఎలా ఎదుర్కొని గెలిచాడు అనేది సింపుల్ గా సినిమా కథ…వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ కి మారుతి లాంటి హిట్ డైరెక్టర్ దొరికాడు…

వీళ్ళ కలయికలో వచ్చిన సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఎక్స్ పెర్ట్ చేస్తారో అవన్నీ మహానుభావుడు సినిమాలో ఉన్నాయి…డానికి యు వి క్రియేషన్స్ వారి అద్బుతమైన రిచ్ నెస్ తోడూ అయ్యి ప్రతీ ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉండగా వీళ్ళకి సంగీత దర్శకుడు తమన్ మంచి పాటలు, మంచి బ్యాగ్ రౌండ్ స్కోర్ తో తన మద్దతుని కూడా ఇచ్చాడు.

దాంతో సినిమాలో కంటెంట్ సింగిల్ లైన్ లో చెప్పేదే అయినా 2 గంటల 30 నిమిషాలు కుర్చీలో చూర్చోబెట్టారు అందరు… శర్వానంద్ సరికొత్త స్టైల్ తో మెప్పించాగా కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు….నటనలో ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేనంతగా నటించాడు.

హీరోయిన్ మేహ్రీన్ కూడా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది…వెన్నెల కిశోర్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ తమ నటనతో ఆకట్టుకోగా…సినిమా ఓవరాల్ గా మరీ అద్బుతం కాకున్నా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు మంచి విందుభోజనంలా అనిపించడం ఖాయం.

కామెడీ వర్కౌట్ అవ్వడం, హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం అక్కడక్కడ ఊపు తగ్గిపోవడం చిన్న మైనస్ పాయింట్స్..ఈ దసరాకి కుటుంబం అంతా కలిసి హ్యాప్పీగా నవ్వుకునే సినిమా మహానుభావుడు…సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్…మీరు సినిమా చూస్తె ఎలా అనిపించిందో చెప్పండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here