సీడెడ్ గడ్డపై 12 కోట్ల ఆఫర్

0
2290

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను తర్వాత చేస్తున్న సినిమా మహర్షి. మహేశ్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిధ్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ లు అందరినీ ఆకట్టుకోగా మహేశ్ న్యూ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారని చెప్పొచ్చు.

ఇక సినిమా కి ఇప్పటి నుండే బిజినెస్ ఆఫర్స్ దక్కుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా సీడెడ్ ఏరియా నుండి సినిమా కి మొదటి బిజినెస్ ఆఫర్ దక్కిందని అంటున్నారు. మొత్తం మీద 12 కోట్ల బిజినెస్ ఆఫర్ ఈ సినిమా కి గాను అక్కడ దక్కిందట.

కానీ నిర్మాతలు ఇప్పట్లో బిజినెస్ ని ఒకే చేయరని అఫీషియల్ టీసర్ రిలీజ్ తర్వాత సినిమా బిజినెస్ మొదలు అవుతుందని అంటున్నారు. మొత్తం మీద ప్రతిష్టాత్మక 25 వ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే ఇయర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సంచలన రికార్డులు నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here