మాస్ కి పూనకాలు ఖాయం…రాసి పెట్టుకోండి…కొరటాల షాకింగ్ కామెంట్స్

0
1795

  సూపర్ స్టార్ మహేశ్ ని అభిమానులు ఓ రేంజ్ మాస్ మూవీస్ లో చూడాలి అని కోరుకుంటున్నారు. శ్రీమంతుడు లో కొన్ని సీన్స్ వాళ్ళని ఆకట్టుకున్నా పోకిరి రేంజ్ లో యాక్షన్ మూవీ కావాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్… స్పైడర్ సినిమా కచ్చితంగా వారి కోరికను నెరవేర్చడం ఖాయమని నమ్మారు. మురగదాస్ ట్రాక్ రికార్డ్ ను బట్టి చూస్తె కచ్చితంగా తుపాకి, కత్తి రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అనుకున్నారు.

తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి హీరోయిజం లేని సీన్స్ తో మహేష్ ని ఓ సాదా సీదా హీరోగా చూడటం ఎవ్వరికీ నచ్చలేదు. దాంతో మాస్ ఎలిమెంట్స్ కి కేరాఫ్ అడ్రస్ అనుకున్న మురగదాస్ అందరినీ నిరాశ పరిచినట్లు అయింది. దాంతో ఇప్పుడు అందరికల్లు మహేష్ అప్ కమింగ్ మూవీ భరత్ అనే నేను పై పడింది.

కాగా ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ కచ్చితంగా ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నామని… నా గత సినిమాల కన్నా ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉంటాయని చెబుతున్నాడట కొరటాల శివ. ఈ సినిమా వచ్చే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here