దిమ్మతిరిగే షాక్:- మహేష్ 15 రోజులు…అసలేం జరిగిందంటే??

0
629

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ భరత్ అనే నేను పై ఎలాంటి అంచనాలు నెలకోన్నాయో అందరికీ తెలిసిందే… మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టిన దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తో మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కంబ్యాక్ చేయాలని భావిస్తున్నాడు.  అందుకోసమే పెర్ఫెక్ట్ డేట్ కోసం వెతికి వెతికి ముందు సంక్రాంతి అనుకున్నా పోస్ట్ పోన్ చేసి పోకిరి డేట్ ని ఫిక్స్ చేశారు.

ఆ డేట్ మరేదో కాదు ఏప్రిల్ 27 న….కానీ అప్పటికే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉండటం తో ఈ రెండు సినిమాలలో ఎదో ఒకటి పోస్ట్ పోన్ కానీ ప్రీ పోన్ కాని అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటుండగా….

ఇప్పుడు కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో 2 కూడా అదే డేట్ కి రిలీజ్ ని ప్లాన్ చేయడంతో టాలీవుడ్ నిర్మాతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కాగా భరత్ అనే నేను నిర్మాత డివివి దానయ్యా సేఫ్ సైడ్ కోసం ఏప్రిల్ 13 డేట్ ని కూడా భరత్ అనే నేను కోసం బుక్ చేసినట్లు సమాచారం…మరి ఇది నిజం అయితే క్లాష్ లేకుండా 15 రోజులు బాక్స్ ఆఫీస్ ను దున్నే చాన్స్ మహేష్ కి ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here