ఇప్పుడు ఈ సినిమా అవసరమా…మహేష్ క్రేజ్ కి ఎసరు??

0
1218

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదన్న విషయం తెలిసిందే…శ్రీమంతుడు సినిమాను వదిలేస్తే మిగిలిన సినిమాలలో 1 నేనొక్కడినే నుండి ఆగడు, బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ సినిమాలతో గత 5 సినిమాల్లో 4 ఫ్లాఫ్స్ ని సొంతం చేసుకున్నా సూపర్ స్టార్ క్రేజ్ ఇసుమంత కూడా కరగలేదు అన్న విషయం తెలిసిందే. అలాంటి మహేష్ స్పైడర్ తో డిసాస్టర్ టాక్ లోను 64 కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించాడు.

అంతే కాకుండా తమిళ్ లోను మొదటి సినిమాగా స్పైడర్ తో ఎంటర్ అయ్యి మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో మహేష్ కి తమిళ్ లో ఏర్పడ్డ క్రేజ్ ని దెబ్బ తీయడానికే అన్నట్లు మహేష్ నటించిన డిసాస్టర్ సినిమాను అక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

ఆ సినిమా మరేదో కాదు బ్రహ్మోత్సవం….మహేష్ కెరీర్ లో అసలు చేయకూడని సినిమా ఏదైనా ఉందీ అంటే అది బ్రహ్మోత్సవం సినిమానే అని అంతా అనేంత డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుని ఎ సినిమా కూడా పొందని క్రిటిసిజంని సొంతం చేసుకున్న ఈ సినిమాని త్వరలో తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారట…స్పైడర్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అయితే ఆ క్రేజ్ కి ఎంతో కొంత డామేజ్ జరిగే చాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి….సినిమా ఈ డిసెంబర్ లోనే అక్కడ రిలీజ్ కానుందట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here