ఖాన్స్ కన్నా మహేష్ గొప్ప…ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్

0
845

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే…సినిమా కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇండస్ట్రీ రికార్డులను తన ఖాతాలో వేసుకునే సత్తా మహేష్ సొంతం…కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలను పరిశీలిస్తే ఒక్క శ్రీమంతుడు తప్పితే చేసిన 1 నేనొక్కడినే, ఆగడు, బ్రహ్మోత్సవం మరియి స్పైడర్ సినిమాలు భారీ డిసాస్టర్ సినిమాలుగా నిలిచి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. అయినా కూడా ఓపెనింగ్స్ లో మహేష్ కుమ్మేశాడు.

స్పైడర్ సినిమానే తీసుకుంటే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతోనే 1 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా… ఫ్లాఫ్ మూవీతోనే ఇలాంటి రికార్డ్ కొట్టిన మహేష్ క్రేజ్ చూసి బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ మహేష్ క్రేజ్ ముందు బాలీవుడ్ ఖాన్స్ ఉట్టిదే అంటూ చెబుతుండటం విశేషం.

బాలీవుడ్ బిగ్ ఖాన్స్ అందరూ తమ సినిమాలు లైఫ్ టైంలో మాత్రమే అలంటి కలెక్షన్స్ ని సాధిస్తారు…కానీ మహేష్ ప్రీమియర్ షోలతోనే ఇలాంటి సంచలనం అంటే మహేష్ ఖాన్స్ కన్నా గొప్ప అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇక మహేష్ భరత్ అనే నేను తో ఎలాంటి భీభత్సం సృష్టిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here