మహేష్ స్పైడర్ 100 రోజుల సెంటర్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
3635

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే….దసరా వీకెండ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ నుండే అండర్ పెర్ఫార్మ్ చేయగా టోటల్ రన్ లో 64 కోట్ల షేర్ ని రాబట్టింది.

కాగా సినిమా 50 రోజుల వేడుకని సుమారు 4 సెంటర్స్ లో జరుపుకోగా ఇప్పుడు 100 రోజుల వేడుకని 1 డైరెక్ట్ సెంటర్ లో జరుపుకుంది ఈ సినిమా…నెల్లూరు లో రామ్ రాజ్ థియేటర్ లో రోజు 4 ఆటలతో సినిమా 100 రోజుల వేడుక ని జరుపుకుందని థియేటర్ యాజమాన్యం తెలియజేసింది.

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్న విషయం తెలిసిందే… సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి…కాగా సంక్రాంతి కానుకగా సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయబోతున్నారట. ఈ సినిమా మహేష్ నికార్సయిన కంబ్యాక్ చేయాలని అంతా కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here