స్పైడర్ రివ్యూ-రేటింగ్…కామన్ ఆడియన్స్ టాక్

0
5755

          టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం లాంటి డిసాస్టర్ తర్వాత అత్యంత భారీ ఎత్తున తెలుగు తమిళ్ భాషల్లో ఏ.ఆర్.మురగదాస్ లాంటి టాప్ డైరెక్టర్ డైరెక్షన్ లో స్పైడర్ ని తెలుగు తమిళ్ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన స్పైడర్ ఈ రోజు అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మహేష్ బ్రహ్మోత్సవం డిసాస్టర్ నుండి బయట పడ్డాడా లేదా మురగదాస్ మహేష్ కి హిట్ ఇచ్చాడా లేదా… తెలుసు కుందాం పదండీ

సినిమా కథ ఏంటో టీసర్ మరియు ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు… జనాలను చంపాలి అని ఫిక్స్ అయిన ఓ సైకో విలన్ అవకాశం వచ్చిన ప్రతీసారి ప్రజలను చంపడమే తన ధ్యేయంగా భావిస్తాడు…కానీ ఎవ్వరికీ కనిపించకుండా ఈ పనులు చేస్తాడు.

ఎక్కడ ఎవ్వరు మాట్లాడినా ఏ ఆపద వచ్చిన తెలుసుకునే ఓ మిషిన్ కనిపెట్టిన మహేష్ కి అనుకోకుండా ఈ సైకో గురించి తెలిసి తనని ఎలాగైనా ఆపాలని చూస్తాడు. ఇక హీరో విలన్ ల మధ్య మైండ్ గేమ్ తో సినిమా మొత్తం సాగుతుంది. ఇది సింపుల్ గా సినిమా స్టొరీలైన్.

మహేష్ బాబు తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఇలాంటి సీరియస్ రోల్స్ ని ఇది వరకే చేసిన మహేష్ ఇందులో కొంచం ఎంటర్ టైన్ మెంట్ ని కూడా కలిపి తన నటనతో మెప్పించాడు. విలన్ ని ఇంటరాగెట్ చేసే సీన్ వన్ ఆఫ్ ది హైలెట్ అని చెప్పొచ్చు.

నిజం చెప్పాలి అంటే మహేష్ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేశాడు ఎస్.జే.సూర్య…. మురగదాస్ మూవీస్ లో విలన్స్ పవర్ ఫుల్ గా ఉంటాడు…ఇప్పుడు కూడా పవర్ ఫుల్ గా ఉండటమే కాదు అల్ట్రా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఎస్.జే సూర్య అదిరిపోయే నటనని కనబరిచాడు.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి చేయడానికి పెద్దగా ఏమి లేకున్నా ఉన్నంతలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా..ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పనులను సక్రమంగా నిర్వర్తించారు అని చెప్పొచ్చు.

సినిమాకు సంగీతం అందించిన హారీష్ జయరాజ్ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఫుల్ మార్కులు కొట్టేశాడు….కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఎలివేల్ అయ్యింది అని చెప్పొచ్చు.

ఇక డైరెక్టర్ మురగదాస్ తన కెరీర్ లో వచ్చిన సినిమాల్లో స్టొరీలైన్ తక్కువగా ఉన్న సినిమాల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. సినిమాలో కథ లేకుండా సింపుల్ కథతో మహేష్ లాంటి స్టార్ డైరెక్టర్ తో ఇంతటి భారీ బడ్జెట్ మూవీ చేయడం సాహసమనే చెప్పాలి.

ఇంతటి భారీ స్టార్ కాస్ట్ మరియు అత్యధిక బడ్జెట్ అత్యాధునిక సాంకేతిక నిపుణులు చేతిలో ఉన్నా మంచి కథని మురగదాస్ ఎంచుకోలేదు…సింపుల్ స్టొరీలైన్ ని తీసుకుని దానికి హాలివుడ్ బాట్ మాన్ సిరీస్ ను ప్రేరణగా తీసుకుని అందులో ఉన్న కథకి సౌత్ నేటివిటీని అద్దాడు.

సినిమాలో తమిళ్ ఫ్లేవర్ మరీ ఎక్కువ అవ్వడం తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు రుచిస్తుందో చూడాలి. మహేష్ కోర్ ఫ్యాన్ బేస్ మొత్తం తెలుగు ఆడియన్స్ అవ్వగా పూర్తిగా తమిళ్ సినిమాలో మహేష్ మరియి మరికొందరు తెలుగు యాక్టర్స్ మాత్రమె తీసుకుని చేసిన సినిమాగా స్పైడర్ అనిపించిందని చెప్పొచ్చు.

మురగదాస్ కథా తెలుగు ఆడియన్స్ కి నచ్చే నేటివిటికి మరికొంత ప్రాధాన్యత ఇస్తే బాగుణ్ణు అనిపించింది. మొత్తం మీద దర్శకుడిగా ఈ సారి జస్ట్ పాస్ మార్కులు మాత్రమె వేయించుకున్నాడు మురగదాస్. ఓవరాల్ గా సినిమా 1 నేనొక్కడినే లాంటి జానర్ కి సంభందించిన సినిమాలా అనిపించినా…

కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ దట్టంగానే ఉండటంతో దసరా సెలవుల్లో కుమ్మేయడం ఖాయం..ఇక కామన్ ఆడియన్స్ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదానిపై సినిమా ఎంత దూరం వెళుతుంది అనేది ఆధారపడి ఉంది…ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే సినిమాను ఒక సారి చూసి ఎంజాయ్ చేయోచ్చు…సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 3/5….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here